మహేష్ బాబుకు ఆ కొరికే లేదా ?

Mahesh Babu not interested in Pan india movies

Mahesh Babu not interested in Pan india movies

ప్రజెంట్ స్టార్ హీరోలు ట్రెండ్ మార్చారు. ఇన్నాళ్లు తెలుగులో సినిమాను ఘనంగా రిలీజ్ చేసుకుని తమిళం, మలయాళంలోకి సాదాసీదాగా డబ్ చేసుకుంటే చాలని అనుకున్న అందరూ ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టారు. ఇతర భాషల్లో తెలుగు సినిమాలకు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో అందరూ పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ నేషనల్ లెవల్లో సినిమాలను రెడీ చేసుకుంటున్నారు.

‘రాధేశ్యామ్, సలార్, పుష్ప, హరి హర వీరమల్లు, ఆర్ఆర్ఆర్, చరణ్ – శంకర్ ప్రాజెక్ట్, లైగర్’ ఇలా చాలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మనసులో మాత్రం పాన్ ఇండియా ఆలోచన లేనట్టే ఉంది. ప్రజెంట్ ఆయన చేస్తున్న ‘సర్కారువారి పాట’ పాన్ ఇండియా మూవీ కాదు. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమా కూడ నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ కాదు. అసలు మహేష్ జాబితాలో పాన్ ఇండియా సినిమా అనేది ఇప్పటివరకు అయితే లేదు. మరి మహేష్ అసలు అలాంటి సినిమాలే చేయరా లేకపోతే భవిష్యత్తులో చేసే ఆలోచన ఏమైనా ఉందా అనేది చూడాలి.