రాజమౌళి మూలంగా మహేష్ బాబు అభిమానులకు నిరాశ తప్పట్లేదు

Mahesh Babu fans disappointed with Rajamouli
Mahesh Babu fans disappointed with Rajamouli
 
మహేష్ బాబు అభిమానులను విపరీతంగా ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి ప్రాజెక్ట్. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్టయ్యింది. ఈ ఏడాదిలోనే సినిమాను లాంఛ్ చేసి పనులు మొదలుపెట్టాలని అనుకున్నారు టీమ్. ఈ సంవత్సరం చివరకు మహేష్ బాబు కమిట్మెంట్స్ అన్నీ పూర్తయి ఆయన ఫ్రీ అవ్వగానే సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లాలని అనుకున్నారు నిర్మాత కె.ఎల్.నారాయణ. 
 
కానీ అవేవీ జరగట్లేదు.  ఎందుకంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పనుల నుండి ఇంకా బయటకు రాలేదు.  షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది.  అది పూర్తికావాలంటే ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.  
 
అది కంప్లీట్ అయినా మహేష్ సినిమా మొదలవుతుందా అంటే అదీ కుదిరేలా లేదు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంది. లాక్ డౌన్ మూలన రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. బహుశా ఈ ఎడాది రిలీజ్ ఉండకపోవచ్చు కూడ. ఏది ఏమైనా సినిమా బయటికి వచ్చేవరకు రాజమౌళి వేరే ప్రాజెక్ట్ టచ్ చేసే వీలుండదు.  కాబట్టి మహేష్ బాబు సినిమా ఇప్పుడప్పుడే మొదలుకాదు. 
 
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం వీరి సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఉండదు. సో.. ఇది మహేష్ బాబు అభిమానులకు కొద్దిగా నిరాశపరిచే విషయమే.