Balakrishna-Mahesh Babu: ప్రస్తుతం బాలకృష్ణ ఆహా లో స్ట్రీమ్ అవుతున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే “హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబు అఖండ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు హోస్ట్గా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ నటుడిగా మాత్రమే కాకుండా, హోస్ట్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు.బాలకృష్ణ ఆ కార్యక్రమానికి హోస్ట్ గా చేయటం వల్ల ఆ కార్యక్రమం సూపర్ హిట్ అయిందని చెప్పటంలో సందేహం లేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో ఈ కార్యక్రమానికి గెస్ట్ గా మహేష్ బాబు రాబోతున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆదరించే అభిమానులందరికీ ఆహా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. మహేష్ బాబు గెస్ట్ గా బాలకృష్ణ షో కి వచ్చే తేదీని ఖరారు చేసి ఆహా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ- మహేష్ బాబు ఇద్దరూ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. కాగా మహేష్ బాబు హాజరయ్యే ఈ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియనుంది. ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసి అందరితో సందడి చేసిన బాలకృష్ణ , మహేష్ బాబుతో ముచ్చట్లు పెట్టబోతున్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్ లు అత్యధికంగా వ్యూస్ రాబట్టాయి. అందరూ ఓ ఆతృతగా ఎదురు చూస్తున్నా బాలకృష్ణ- మహేష్ బాబు ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
మహేష్ బాబు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి హాజరయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఉ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి చేసుకోగా 40 శాతం ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహేష్ బాబు ఉ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా వస్తుందనుకున్న సర్కారు వారి పాట సినిమా వాయిదా పడి ఆగస్టు లో రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.