Maharshi Raghava: ప్రముఖ తెలుగు నటుడి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహర్షి రాఘవ ఇంటి విషాదం జరిగింది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో మహర్షి రాఘవ తల్లి చనిపోయారు. ఆమెకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవి రంగంలో స్థిరపడగా… రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. రాఘవ పలు సినిమాలు, సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితే. రాఘవ తల్లి చనిపోవడంతో.. సినీ ప్రముఖుకు ఆమెకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఈరోజ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కమలమ్మ అంత్యక్రియలు జరిగాయిసీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన ‘ మహర్షి’ సినిమాలో రాఘవ హీరోగా నటించారు. ఈ సినిమాతో పాపులర్ అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించినా.. అనుకున్నంత స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. మహర్షి సినిమా ఆ సమయంలో మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. ఇళయరాజా అందించిన మ్యూజిక్ సెన్సేషన్ గా నిలిచింది. ‘సుమం ప్రతి సుమంసుమం’, ‘మాటరాని మౌనమిది’ క్లాసిక్ సాంగ్స్ గా నిలిచాయి.
మహర్షి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు రాఘవ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. `జంబలకిడిపంబ`, `చిత్రం భళారే విచిత్రం`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం`వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. మరోవైపు పలు సీరియళ్లలో నటిస్తున్నారు. తల్లి కమలమ్మ మరణంతో రాఘవ తీవ్ర విషాదంలో ఉన్నారు.