టీడీపీ ఎమ్మెల్యేలు…మాజీ నేతలు వైకాపా కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నట్లు ఇప్పటికే కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అటు సీనియర్స్, మాజీ నేతలు కూడా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా జగన్ పిలుపు కోసం ఎదురుచూసే వాళ్లు ఇంకొంత మంది ఉన్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 సీట్లు దక్కించుకుని ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన నాయకుడిగా రికార్డు సాధించారు. ఇక జగన్ ముందున్న టార్గెట్ అసెంబ్లీ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం లేకుండా చేయడమే. ప్రస్తుతం వైకాపా సర్కార్ ఆదిశగానే అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
మరోసారి క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబు నాయుడికి గట్టి షాక్ ఇవ్వాలని వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారు. మొన్న మహానాడుకు ముందే ఈ ఘట్టాన్ని జగన్ పూర్తి చేయాలనుకుటన్నట్లు ప్రచారం సాగింది. కానీ లాక్ డౌన్ కారణం, రాష్ర్టంలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వంటి అంశాలలో వైకాపా వెనక్కి తగ్గింది. లేదంటే ఇప్పటికే ఆ ఘట్టం పూర్తయ్యేదని కథనాలు వేడెక్కించాయి.స్థానిక ఎన్నికలు వస్తోన్న నేపథ్యంలో సరిగ్గా అ ఎన్నికలకు ముందుగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంత మంది వస్తానంటే? అంత మందిని తమ వైపుకు లాక్కునేలా ఫిరాయింపులు పాల్పడుతున్నట్లు ఇన్ సైడ్ జోరుగా టాక్ వినిపిస్తోంది.
ఎన్నికలు లోపు ఆ ప్రక్రియను పూర్తి చేస్తే స్థానిక ఎన్నికలకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉందడదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పటికే సర్కార్ పై వస్తోన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా పార్టీ ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పక్షం ఎంత బలం పెంచుకుంటే? పార్టీకి అంతగా కలిసొస్తుందని అదిష్టానం భావిస్తోందిట. ఆ విధంగా చేస్తే స్థానిక ఎన్నికల్లో ఖర్చు కూడా తగ్గుతుందని వైకాపా శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.