Macharla Niyojakavargam: రంగస్థలం సినిమాకి దగ్గరగా నితిన్ కొత్త సినిమా..?

Macharla Niyojakavargam: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జూనియర్ లో నడుస్తుంది అనే విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పేశారు. ఇకపోతే నితిన్ తాజాగా నటిస్తున్న ఈ మాచర్ల నియోజకవర్గం సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కు దగ్గరగా కనిపిస్తాయని అంటున్నారు. ఈ సినిమా విషయానికొస్తే..

గ్రామీణ నేపథ్యంలో అక్కడి రాజకీయాలతో ముడిపడి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా నిలిచి అక్రమాలకు పాల్పడుతున్న ఒక పెద్ద మనిషి ఆట కట్టించడం కోసం, అతనికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ హీరో రంగంలోకి దిగుతాడు. ఇక అప్పటి వారిద్దరి మధ్య రివేంజ్ డ్రామా మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మహతి సర్వ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.