సుధీర్ కి రెండింతల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన మా టీవీ.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన సుధీర్..సినిమా అవకాశాలను కూడా అందుకున్నాడు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా వెండితెర మీద సందడి చేశాడు. సుధీర్ హీరోగా నటించిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. అయినప్పటికీ సుధీర్ ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇలా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెండితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సుధీర్ తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. జబర్దస్త్ రెమ్యూనరేషన్ విషయంలో సుధీర్ అసంతృప్తిగా ఉండటం వల్ల ఆ షో నుండి బయటకి వచ్చాడని సమాచారం. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో సందడి చేసిన సుధీర్ కి మల్లెమాల వారు దాదాపు 7 నుండి 10 లక్షలు వరకు పారితోషికం ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లెమాల వారి పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్న సుధీర్ జబర్దస్త్ నుండి బయటకు రావాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని సమచారం.

ఇదిలా ఉండగా సుధీర్ ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో యాంకర్ గా సందడి చేస్తున్నాడు. అంతే కాకుండా ఇటీవల మాటీవిలో ప్రసారమైన పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమంలో కూడా సుధీర్ కనిపించాడు. అయితే ఇప్పుడు ఈ షోస్ కి సుధీర్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో షెడ్యూల్ కి మా టీవి వారు సుధీర్ కి మల్లెమాల వారిచ్చే రెమ్యూనరేషన్ కన్నా డబుల్ డెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అంటే సుధీర్ ఇప్పుడు ఒక్కో షెడ్యూల్ కి దాదాపు 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుతున్నట్టు తెలుస్తోంది.