మా అసోసియేషన్ ఎన్నికలు.. పెద్ద తలలు దిగుతాయా ?

MAA elections will be more interesting this time
MAA elections will be more interesting this time
టాలీవుడ్ మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.  ఇండస్ట్రీలో ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంది.  ఈ అసోసియేషన్లో ఇప్పటికే పలు వివాదాలు చెలరేగాయి.  ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవడం సర్దిచెప్పడం జరిగాయి.  జీవిత రాజశేఖర్, నరేష్ ఇలా ప్రముఖ వ్యక్తులు మా అసోసియేషన్ తరపున పనిచేయడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగాయి.  ఇలాంటి ఈ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మరబోతున్నాయి. 
 
ఎందుకంటే ఈ దఫా ఎన్నికల్లో పెద్ద తలలు జోక్యం చేసుకోబోతున్నాయి కాబట్టి.  మా ఎన్నికల్లో ఈసారి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగబోతున్నారు.  ప్రకాష్ రాజ్ చాలా ముక్కుసూటి మనిషి.  ఎవ్వరి మీదైనా నిర్మొహమాటంగా విమర్శలు చేయగలరు. 
 
ఇక ఆయనకు పోటీగా మంచు విష్ణు బరిలో నిలబడతారని వినికిడి.  ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మంచి పట్టుంది.  చాలామంది మోహన్ బాబును ఆమోదించి వెళ్ళేవాళ్ళు ఉన్నారు.  మంచు విష్ణుకి పెద్ద వ్యక్తులే మద్దతుగా నిలుస్తున్నారని తెలుస్తోంది.  ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తారట.  అసలు విష్ణు చిరంజీవి సలహా తీసుకునే మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలా వద్దా అనేది ఫైనల్ చేసుకోనున్నారట. 
 
విష్ణు పోటీచేయడం అంటూ జరిగితే చిరంజీవి మద్దతుతోనే చేస్తారని, చిరుకి సన్నిహితులైన శ్రీకాంత్, అలీ లాంటి ప్రముఖులు విష్ణు వెనకే ఉన్నారని సమాచారం.  మొత్తానికి ఈసారి మా ఎన్నికలు పెద్ద తలల కనుసన్నల్లో జరుగుతాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.