ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో తళుక్కుమన్న అందాల భామ రాశీ ఖన్నా. ఈ అమ్మడు జిల్ చిత్రంలో జిల్లుమనే అందాలతో యువత మనసు దోచింది. అనంతరం జై లవకుశ లో ఎన్టీఆర్ సరసన నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ప్రతి రోజు పండుగే చిత్రంలో సాయిధరమ్ సరసన నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇందులో ఆర్నా అనే పాత్రకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఇక రీసెంట్‌గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది. ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉండే రాశీ ఖన్నా ఒకేసారి అలా మారేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
అయితే రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. క్వారంటైన్ తరవాత ఆమె చేసిన ఫస్ట్ ఫొటోషూట్ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.అందులో వయ్యారాలు వలకబోస్తూ హద్దులు చెరిపేస్తున్నట్టుగా ఉంది. అనంతరం చేప పొలుసు లాంటి డ్రెస్‌లో సాగర కన్యలా ఫొటోషూట్ చేసింది . ఎరుపు, ఆకుపచ్చ రంగు ఓణీలో పల్లెటూరి బొమ్మలా కూడా మెరిసింది రాశి. ఈ ఫోటోలలో చాలా తక్కువ మేకప్, సింపుల్ కాస్ట్యూమ్స్, చెవులకు జూకాలు, చేతులకు మట్టి గాజులతో అచ్చతెలుగందంతో కట్టిపడేసింది. ఈ కాస్ట్యూమ్‌ను శ్రావణ్ కుమార్ డిజైన్ చేయగా, అతినికి థ్యాంక్స్ చెబుతూ, ఈ లుక్ తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించింది.
అందాలన్ని రాశిగా పోసి పరువాల తరాజులో తూకం వేస్తే ఆ ముగ్ధసౌందర్యం రాశీఖన్నా రూపంలో సాక్షాత్కరిస్తుంది. బాపు బొమ్మలా చూడముచ్చటైన రూపంతో అలరారే ఈ పంజాబీ సోయగం దసరా సందర్భంగా కొత్త ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ చీరకట్టులో, కొంటె చూపులతో సిగ్గుల మొగ్గవుతూ..అల్లరినవ్వులతో కవ్విస్తున్న ఫోటోలని తన ట్విట్టర్లో షేర్ చేయగా ఇందులో రాశీ ఖన్నా ద్విగుణీకృతమైన అందంతో కనిపిస్తోంది. ‘అచ్చ తెలుగందానికి అసలైన చిరునామాగా ఉన్నావు’ , ‘నీ అమాయకపు చూపులతో మా హృదయాల్ని దోచేస్తున్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు తన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైన తన ఫోటోలతోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడం రాశీఖన్నాస్పెషాలిటీగా మారింది.