Love Story : జగన్ టికెట్ ధరలపై ‘లవ్ స్టోరీ’ నిర్మాత సంచలన కామెంట్స్ వైరల్.!

Love Story :  గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇచ్చిన భారీ సినిమా “వకీల్ సాబ్” సినిమాతో ఏపీలో ఒక్కసారిగా సినిమా పరిస్థితి తలకిందులు అయ్యింది. ఆకస్మికంగా టికెట్ ధరలు తగ్గించేయడం, బెనిఫిట్ షో లు రద్దు చేయడం సంచలనంగా మారింది. దీనితో ఇదే సంప్రదాయం ఇతర అన్ని సినిమాలకు కూడా వర్తింపజేయడంతో ఈ సమస్య మరింత పెద్దది అయ్యింది.

అయితే ఈ కొత్త టికెట్ ధరల పైనే ఈ ఏడాది భారీ హిట్ “లవ్ స్టోరీ” నిర్మాత నారాయణ దాస్ నారంగ్ సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దేశంలో ఎక్కడా లేని టికెట్ ధరలు ఏపీలో ఉన్నాయని. తెలంగాణాలో కూడా ధరలు బాగున్నాయి కానీ ఏపీలోనే బాగాలేవని వ్యాఖ్యానించారు.

దేశం అంతా ఏటో వెళుతుంటే అటు వైపే వెళ్ళాలి కానీ మనం ఇంకో వైపు వెళ్లలేం కదా అని చెప్పారు. ఈ ధరలతో అయితే నిర్మాతలు గట్టెక్కలేరని అత్యధిక థియేటర్ లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని ఆయన చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఇలా కామెంట్స్ చెయ్యడానికి కూడా కారణం లేకపోలేదు. తాను తీసిన లవ్ స్టోరీ కి ఏపీలో పలు చోట్ల స్వల్ప నష్టాలే వచ్చాయి ఇది చాలా మందికి తెలియదు.