TG: కేసీఆర్ వచ్చేలోపే తెలంగాణలో పాతుకు పోవాలి…. తెలంగాణపై ఫోకస్ చేసిన లోకేష్?

TG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో మంచి క్రేజ్ ఉండేది అయితే రాష్ట్ర విభజన తరువాత ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు దీంతో అక్కడ కాస్త తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత తగ్గింది కానీ 2024 ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎంతో మంచి ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణపై కూడా ఫోకస్ చేశారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వీకెండ్ హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం నేతలతో చర్చలు జరుపుతూ పూర్తిస్థాయిలో తెలంగాణపై ఫోకస్ చేశారు కానీ ఏపీలో బిజీ అవుతున్న నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ వెళ్లడం పూర్తిగా మానేశారు. ఈ క్రమంలోనే చినబాబు లోకేష్ తెలంగాణపై ఫోకస్ చేశారని తెలుస్తుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక బిఆర్ఎస్ నాయకుడు కెసిఆర్ కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక ఈ పార్టీ హడావిడి మొత్తం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే చూసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి అన్న ఆలోచనలు నారా లోకేష్ ఉన్నారు అందుకు తగ్గ వ్యూహాలు కూడా రచిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ బృందానికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిశోర్‌తోనూ ఇటీవల నారా లోకేష్ బేటి అయ్యారు ఇలా వీరి వ్యవహార శైలి చూస్తుంటే అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది. అయితే తెలంగాణలో పార్టీని తిరిగే గాడిలోకి తీసుకురావాలి అంటే చాలా కష్టమైన విషయం అనే సంగతి తెలిసిందే. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని సంకల్పంతోనే నారా లోకేష్ తెలంగాణపై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.