AP: కూటమిలో రెండు రెడ్ బుక్కులు ఉన్నాయి… ఒకటి లోకేష్ …మరొకటి అతని వద్ద ఉందా?

AP: తెలుగుదేశం పార్టీ యువ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో రెడ్ బుక్కు అందరికీ పరిచయం చేశారు. వైసిపి హయాంలో తమని ఇబ్బంది పెట్టిన వారందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో రాస్తున్నారని తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అంటూ కొంతమంది పేర్లను ఆ పుస్తకంలో రాసినట్టు తెలుస్తుంది.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం వైసిపి నేతలు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ కూటమినేతలపై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ రెడ్‌బుక్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు.

ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్లో రెడ్‌బుక్ పాలన నడుస్తుందని… ఈ అక్రమ అరెస్టులు ప్రతి ఒక్కరు ఖండించాలంటూ మండిపడ్డారు. ఎవరిని పడితే వారిని అరెస్టు చేసుకుంటూ పోతున్నారని ఈయన మండిపడ్డారు అంతేకాకుండా రెడ్ బుక్కు గురించి ఈయన మరొక విషయాన్నీ కూడా వెల్లడించారు కూటమి నేతల వద్ద ఉన్నది ఒక రెడ్ బుక్ కాదని రెండు పుస్తకాలు ఉన్నాయని తెలిపారు.

ఒకటి నారా లోకేష్ వద్ద ఉంది ఆయన ఆ పుస్తకంలో పేర్లు రాసిన వారందరిని కూడా అరెస్టు చేయించి జైలుకు పంపిస్తున్నారు అయితే మరొక రెడ్ బుక్ ఎవరి దగ్గర ఉంది అనే విషయాన్ని కూడా గణేష్ బయటపెట్టారు. మరొక రెడ్ బుక్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉందని ఆయన వైసీపీ నేతలు ఎవరైతే తనకు నచ్చరో వారందరి పేర్లు రాసుకున్నారని అందుకే బలవంతంగా అరెస్టులు చేయిస్తున్నారు అంటూ గణేష్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగానే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్టు చేశారు అంటూ పోసాని అరెస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రెడ్ బుక్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.