‘లైగర్’ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్ రిలీజ్

Liger

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది.

లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. అలాగే థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన అమ్మవారి, పోతురాజు ప్రత్యేక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల కేరింతలు మధ్య లైగర్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైయింది.

”ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ” అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బమ్స్ మూమెంట్స్ తో అద్భుతం అనిపించింది. ఫస్ట్ గ్లింప్స్ లో లైగర్ ని మాత్రమే పరిచయం చేయగా ట్రైలర్ లైగర్ వైల్డ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంఎంఎ టైటిల్‌ను గెలవడానికి చేసిన ప్రయాణాన్ని ట్రైలర్ లో పవర్ ప్యాక్డ్ గా చూపించారు. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి వుండటం బిగ్ సర్ప్రైజ్, ఛాలెంజ్. ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కారించారు. ‘ఐ లవ్ యూ’ అనే మాటని లైగర్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగా వుంది. ట్రైలర్.. లైగర్ ప్రయాణంలోని ఎమోషన్ ని ఎత్తుపల్లాలని అద్భుతంగా ప్రజంట్ చేసింది. ట్రైలర్ లో లెజెండ్ మైక్ టైసన్ స్టైలిష్ ఇంట్రో మ్యాజికల్ మూమెంట్ గా వుంది. ” ఐయామ్ ఏ ఫైటర్”అని విజయ్ అంటే.. దానికి బదులుగా ”నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి ? ”అనే అర్ధం వచ్చేలా మైక్ టైసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ని ఇచ్చింది.

దర్శకుడు పూరీ జగన్నాధ్ లైగర్ కోసం గ్రేట్ స్టార్ కాస్ట్ ని ఎంచుకున్నారు. లెజెండ్ ఐకాన్ మైక్ టైసన్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించారు. తన క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చిన విజయ్ లుక్స్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ తో పూరి- విజయ్ తుఫాన్ సృష్టించారు.
తల్లి పాత్రలో రమ్య కృష్ణ తన నటనతో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అనన్య పాండే ఒక ట్రెండీ రోల్ ప్లేయ్ చేస్తుండగా రోనిత్ రాయ్ కోచ్‌గా కనిపించారు.

టెక్నికల్‌గా ట్రైలర్‌ సాలిడ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో వున్నాయి. ఇవి చిత్రానికి ప్రధాన బలం. డిఫరెంట్ సౌండ్‌లతో కూడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ ఎలివేషన్‌ ఇచ్చింది. షార్ఫ్ ఎడిటింగ్‌తో ట్రైలర్ కట్‌ మార్వలెస్ అనిపించింది. లైగర్ టీం టాప్ క్లాస్ వర్క్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన గంటల్లోనే లైగర్ ట్రైలర్ పాన్ ఇండియాని షేక్ చేసింది. ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ వ్యూస్, లైక్స్ తో గత రికార్డులన్నీ బ్రేక్ చేసి జెడ్ స్పీడ్ తో దూసుకుపోతోంది లైగర్ ట్రైలర్. లైగర్ స్పీడ్ చూస్తుంటే విజయ్ దేవర కొండ చెప్పినట్లు.. ఆగస్ట్ 25న దేశం మొత్తం షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చేక్కిపోతుంది. అసలు ఏం అర్ధమైతలేదు. రెండేళ్ళు అవుతుంది సినిమా విడుదలై. ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా లైగర్ ట్రైలర్ కి అభిమానులు రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. మీ ప్రేమని మాటల్లో చెప్పాలంటే ఐ.. ఐ.. ల వ్ యూ (లైగర్ పాత్రలో). ఈ సినిమా అభిమానులకు అంకితం చేస్తున్నా. ఈ సినిమాలో బాడీ చేయడం, ఫైట్స్ చేయడం ఒక ఎత్తు అయితే డ్యాన్స్ మరో లెవెల్. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని డ్యాన్సులు చేశా. ఆగస్ట్ 25న ప్రతి థియేటర్ లో పండగ జరగాలి. ప్రేక్షకులతో నిండిపోవాలి. ప్రామిస్ చేస్తున్నా. ఆగస్ట్ 25 ఇండియా షేక్ అయితది. మనం ఆగస్ట్ 25 ఏం చేస్తున్నాం ? ఆగ్ లగా దేంగే. ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదని అభిమానులు కొంచెం ఫీలయ్యారు. పూరి గారి మాటల్లో చెప్పాలంటే..’ఎప్పుడు వచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా ? అందరికీ నా ప్రేమ”అని తెలిపారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ట్రైలర్ ఎట్లుంది ? విజయ్ ఎట్లున్నాడు ? చింపిండా లేదా? లైగర్ గురించి కాదు విజయ్ గురించి చెబుతున్నా విజయ్ దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా.. రాసిపెట్టుకోండి. కరణ్ జోహార్ గారు మాకు బిగ్ సపోర్ట్. మిమ్మల్ని చూపించడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచా. మాకు సినిమా అంటే ఎంతపిచ్చో చూపించడానికి ఇక్కడికి పిలిచాను. సరిగ్గా ఇంకా నెల రోజులు వుంది సినిమా. ఇలాగే వుండండి. ఇలాగే వుంటది. కుమ్మేద్దాం. లవ్ యూ” అన్నారు.

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ రాక్స్. రౌడీ రాక్స్. లైగర్ రాక్స్. మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. లైగర్ పై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. లైగర్ ఆగస్ట్ 25 న థియేటర్ లోకి వస్తుంది. మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా. ఆగస్ట్ 25న థియేటర్లో కలుద్దాం” అన్నారు.

అనన్య పాండే మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పంచిన అభిమానం చాలా క్రేజీగా వుంది. వారి కుటుంబంలో ఒకరిగా వుండాలని కోరుకుంటున్నాను” అన్నారు

అపూర్వ మెహతా మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ లతో కలసి లైగర్ కోసం పని చేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. లైగర్ కోసం చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ఆగస్ట్ 25 కోసం ఎదురుచూస్తున్నాం” అన్నారు.

అనిల్ తడాని మాట్లాడుతూ.. లైగర్ తో భాగమైనందుకు ఆనందంగా వుంది. పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతాలకు ధన్యవాదాలు. లైగర్ టీంకి ఆల్ ది బెస్ట్” తెలిపారు

తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: పూరీ జగన్నాథ్

నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా

బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్

డీవోపీ: విష్ణు శర్మ

ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా

ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

స్టంట్ డైరెక్టర్: కేచ