Liger : ఇంకో ఏడాది లేట్ తో రెండు క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన విజయ్ “లైగర్”

Liger : టాలీవుడ్ నుంచి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న ఏకైక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ. తన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఇంకో స్థాయికి వెళ్ళిపోయినా విజయ్ దేవరకొండ ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. తర్వాత కూడా మంచి హిట్స్ అనుకోని సరైన దర్శకుడు దగ్గరే పడ్డాడు.

అతడు మరెవరో కాదు పక్కా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక పూరి సంగతి తెలిసిందే. నార్మల్ హీరోనే ఓ రేంజ్ లో చెక్కుతాడు. ఇక అలాంటిది విజయ్ లాంటి హీరో దొరికే మాస్ చూపిస్తాడు. అలానే అనౌన్స్ చేసిన భారీ సినిమా “లైగర్” అనౌన్స్ చేయడంతోనే పాన్ ఇండియా సినిమాగా దీన్ని ప్రకటించారు.

అయితే ఈ చిత్రం నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తో దాదాపు ఏడాది వెనక్కి వెళ్ళినట్టే అని చెప్పాలి. ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇప్పుడు ఆగష్టు 25కి ఫిక్స్ చేసినట్టుగా ప్రకటించారు. అలాగే దీనితో ఇంకో క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు.

ఈ డిసెంబర్ 31న కొత్త ఏడాది కానుకగా సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనితో ఈ క్రేజీ వీడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాని మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తుండడం ఒకెత్తు అయితే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని ఓ కీలక పాత్రలో చూపిస్తుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.