అదరిందమ్మా అనన్యా: అప్పుడే ఇంత పబ్లిసిటీ.!

అనన్యా పాండే.. బాలీవుడ్ నుండి దిగుమతి కాబోతున్న ముద్దుగుమ్మ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్’ మూవీలో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. కానీ, అమ్మడి పేరు మాత్రం మార్మోగిపోతోంది.

ఎక్కడా.? ఎలా.? అనుకుంటున్నారా.? అదేనండీ, బాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ కలకలం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి ధూమ్ ధామ్ అవుతోంది.

అదే కేసుకు సంబంధించి అందాల భామ అనన్యా పాండే పేరు కూడా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను గత రెండు రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆమెకు అప్పుడే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. ఒకవేళ సినిమా రిలీజ్‌కి సిద్ధమైనా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదేమో. ‘లైగర్’ రిలీజ్‌కి ఇంకా చాలా టైమే ఉంది. ఈ లోపే అనన్యా బోలెడంత పబ్లిసిటీ వెనకేసుకునేలా కనిపిస్తోంది సీను చూస్తుంటే.