కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల కొన్ని సడలింపులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు రాష్ర్టాలు ముందుగా లిక్కర్ షాపులు తెరిచాయి. దీంతో జనాలు ఒక్కసారిగా గుమ్మిగూడటంతో ప్రజలు సహా విపక్షాలు భగ్గుమన్నాయి. దీనంతటకీ అసలు కారణం కేంద్ర ప్రభుత్వం అంటూ అక్కడా విమర్శలు తప్పలేదు. దీంతో లైన్ లోకొచ్చిన కేంద్ర మంత్రి మద్యం అమ్మకాలు రాష్ర్టాలు ఇష్టం…ఆ హక్కులు కేంద్రం ఫరిదిలోకి రావంటూ విమర్శలను తిప్పికొట్టారు. ఇక తమిళనాడులో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వైన్ షాపులు తెరవకూడదని..కవేలం ఆన్ లైన్ విక్రయాలు జరపాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో తమిళనాడు లో తాత్కలికంగా లిక్కర్ కు మళ్లీ తాళం పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మద్యం షాపులకు అనుమతివ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకు రానుంది. దీంతో తమిళనాడు మందు బాబులు విచారణ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
లాక్ డౌన్ ఈనెల 17 వరకూ అమలులో ఉంటుంది. అటుపై కేంద్ర లాక్ డౌన్ పొడిగించేలా నిర్ణయాలు తీసుకుంటుందా? పూర్తిగా ఎత్తేస్తారా? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. అయితే కేంద్ర మంత్రులు వీలైనంత త్వరగా ప్రజా రవాణ ప్రారంభం అవుతుందని ఇటీవలే వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఇచ్చిన సడలింపులు…రాష్ర్టాలు కరోనా వైరస్ గురించి చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే ఈ నెల 17 తో లాక్ డౌన్ కి శుభం కార్డు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.