Madhavi Latha: సాధారణంగా పెళ్లి సహజీవనం గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయాలు అయితే తాజాగా నటి మాధవి లత ఈ విషయం గురించి మాట్లాడుతూఅయితే తాజాగా నటి మాధవి లత ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సహజీవనానికి తాను సై అనట్లేదు. లేదు కానీ సహజీవనం అనేదాన్ని బెటర్ అని మాత్రం తాను అంటానని నటి మాధవి లత స్పష్టం చేశారు. సమాజంలో పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత విడాకులు తీసుకునే దాని కంటే సహజీవనం బెటర్ కదా అని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరి అంగీకారం అవసరం లేదు. ఎవరికీ సాక్ష్యాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆస్తుల మీద ఎవరు అధికారం చెలాయించాల్సిన అవసరం కూడా ఉండదని ఆమె వివరించారు. హ్యాపీగా కలిసి ఉన్నన్ని రోజులు ఉంటారు. విడిపోయేటప్పుడు అండర్ స్టాండింగ్ తో విడిపోతారు.
ఇకపోతే ఇలా కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. సెకండ్ హ్యాండ్ అనే బ్రాండ్ అక్కర్లేదు. తను డివోర్స్.. ఇది రెండో పెళ్లి అంట, మూడో పెళ్ళంట ఇలాంటివన్నీ ఏవీ అవసరం లేదని ఆమె చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదని మాధవీలత స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు కూడా అందుకే దాన్ని లీగల్ చేసిందని, భారతదేశంలో ఎంత మంది భారతీయుల్ని ఆపగలుగుతున్నాం అని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ కలిసుంటే ఉంచుకున్నారని అంటారని, ఉంచుకోవడానికి ఏమైనా వస్తున్నావా… మనుషులు అని ఆమె చెప్పారు. మనుషులు ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఉంచుకోవడం అనే మాట ఎందుకని ఆమె అన్నారు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్లకు కలిసి ఉండాలి అనిపిస్తుంది అని, అందుకే వాళ్ళు కలిసి ఉంటారని మాధవీలత చెప్పారు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహజీవనమే బెటరని తాను నమ్ముతున్నట్టు వివరించారు.