అనసూయ డ్రెస్సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ డైరక్టర్…!

బుల్లి తెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకరింగ్ తో పాటు తన అందంతో కూడా అనసూయ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకవైపు టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ నటిగా కూడా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్రలో నటించిన అనసూయ..తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.

ఇక అనసూయ గ్లామర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అనసూయ చేసే చర్చ అంతా ఇంతా కాదు. టీవీ షోల కోసం ప్రతివారం ఫోటో షూట్ చేయించుకునే అనసూయ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అందంతో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో మితిమీరిన గ్లామర్ షో చేయటం వల్ల విమర్శలను కూడా ఎదుర్కొంది. ఎట్టకేలకు అనసూయ ఒక వైపు యాంకర్ గా మరొక వైపు నటిగా కూడా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఇటీవల అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ప్రముఖ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అనసూయ గురించి మాట్లాడుతూ అనసూయ డ్రెస్సింగ్ సెన్స్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఎప్పుడూ ట్రెండీగా ఉండే అనసూయ డ్రెస్సింగ్ నాకు నచ్చుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనసూయ నటన గురించి మాట్లాడుతూ..రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన అద్భుతం.. మొన్నటి ‘పుష్ఫ’ సినిమా లోనూ దాక్షయణిగా తన నటనా ప్రతిభను చూపించిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా అనసూయకు మంచి అవకాశాలు దక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గీతాకృష్ణ అనసూయ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.