ప్రముఖ నటి మీనా భర్త హఠాన్మరణం.. షాక్ లో సినిమా ఇండస్ట్రీ?

ప్రముఖ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మికంగా మృతి చెందారు.ఈయన మరణ వార్త ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు.ఈ క్రమంలోనే నటి మీనా భర్త సైతం పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈయన నేడు మృతిచెందారు.ఇక ఈయన మరణ వార్త తెలియడంతో ఒకసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురైంది.

ఎన్నో తమిళ తెలుగు సినిమాలలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అందరిని మెప్పించిన మీనా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె నటిగా మంచి గుర్తింపు పొందిన సమయంలో విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు. 2009లో వీరి వివాహం జరగగా వీరికి నైనిక అనే ఒక చిన్నారి ఉంది. ఇప్పటికే నైనిక సైతం బాలనటిగా వెండితెర అరంగేట్రం చేశారు.

ఇకపోతే విద్యాసాగర్ గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కుటుంబం మొత్తం జనవరి నెలలో కరోనా బారిన పడ్డారు. దీంతో ఈయనకు ఊపిరితిత్తుల సమస్య మరింత అధికమైంది. దీంతో ఈయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ వుండగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.ఇకపోతే ఈయన మరణ వార్త తెలియడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు అభిమానుల సోషల్ మీడియా వేదికగా మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.