Glamorous Heroine : లేటెస్ట్ : ఈ తెలుగు యంగ్, గ్లామరస్ హీరోయిన్ కి కరోనా..!

Glamorous Heroine : ఏ సినిమా ఇండస్ట్రీ లో కూడా లేని విధంగా ఒక్క మన తెలుగు ఇండస్ట్రీ లోనే మన భాషకి చెందిన హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా మన దక్షిణాది సినిమా దగ్గర అన్ని భాషల్లోని ఆ భాషకి చెందిన హీరోయిన్స్ ఎక్కువగానే కనిపిస్తారు. కానీ మన టాలీవుడ్ లోనే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ తక్కువ మందిలో కూడా మంచి గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ మాత్రం ప్రియాంకా జవాల్కర్ అని చెప్పాలి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన చిత్రం టాక్సీ వాలా తో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది.

మరి ఇప్పుడు ఈమె స్పీడ్ కి కరోనా బ్రేక్ వేసింది. ఈ కరోనా మూడో వేవ్ లో అత్యధికంగా సినీ తారలే ఎఫెక్ట్ అవుతూ వస్తుండడం ఆసక్తిగా మారిపోయింది. అలా ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కరోనా బారిన పడినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తాను ఆల్రెడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి సోకింది అని తెలిపింది.

ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని గత కొన్ని రోజుల్లో తనని కలుసుకున్న వారు కూడా టెస్ట్ చేయించుకోండి అని అందరూ మాస్క్ ధరించండి అవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకి రండి అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ మూడు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.