“పుష్ప పార్ట్ 2” రిలీజ్, సినిమా పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం.!

గత ఏడాది ఇండియా సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల మధ్య వచ్చిన హ్యాట్రిక్ సినిమా “పుష్ప” మాత్రమే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ “పుష్ప ది రైజ్” గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది.

ఇక దీనితో రెండో పార్ట్ పుష్ప ది రూల్ పై అనేక అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ సమాచారాలు బయటకి వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ ని మొదటగా వచ్చే ఏడాది వేసవిలో ప్లాన్ చేస్తారని వినిపించింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్లానింగ్ లో అయితే మళ్ళీ డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేస్తారట.

అలాగే దీనితో పాటుగా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై కూడా తెలుస్తుంది. ఈ సినిమాని ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ హిట్స్ పై ఉంటున్న అంచనాలు నిమిత్తం సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా పార్ట్ 2 ని ప్లాన్ చేసాడట. ముఖ్యంగా పుష్ప మరియు భన్వర్ సింగ్ ల మధ్య ఫేస్ టు ఫేస్ గేమ్స్ చాలా ఆసక్తిగా ఉంటాయట.

స్క్రిప్ట్ పరంగా అయితే చాలా బాగా కంప్లీట్ చేసానని అలాగే కాకపోతే సినిమాని మొదటి భాగం కన్నా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నామని అందుకే కాస్త టైం అయితే పడుతుంది. ఈ లెక్కన డిసెంబర్ రిలీజ్ బాగుంటుందని సుకుమార్ అనుకుంటున్నాడట. మొత్తానికి అయితే పార్ట్ 2 దెబ్బ మరింత గట్టిగా ఉండేలా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.