ఇండస్ట్రీ టాక్ : ఆ సినిమా నుంచి ప్రభాస్ తప్పుకుంటున్నాడా.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు కొన్ని షూటింగ్ దశలో ఉండగా ఓ సినిమా ఏకంగా రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా అనంతం కొన్ని సినిమాలు ఇంకా అనౌన్స్ కావాల్సి అయితే ఉంది.

మరి ఈ సినిమాల్లో మీడియం సినిమాల దర్శకుడు అయినటువంటి మారుతితో ఓ సినిమా ఓకే చేశారు. అయితే ఈ చిత్రం పై గత కొన్ని రోజులు నుంచి సడెన్ గా ఓ చర్చ అయితే నడుస్తుంది. మారుతీ ఈ సినిమా విషయంలో బాగానే కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు కానీ ప్రభాస్ రిస్క్ తీసుకోవడం అయితే అభిమానులు ఒప్పుకోవట్లేదు.

దీనితో ఈ చిత్రం మొదలు అనేది కాస్త ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇక ఇప్పుడు అయితే సినీ వర్గాల నుంచి ప్రభాస్ ఏకంగా ఈ సినిమా నుంచి అందాకా తప్పుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. కానీ మారుతీ అయితే ప్రభాస్ తనతో సినిమా చేస్తాడనే అనుకుంటున్నాడట.

మరి అది ఇప్పుడే అవుతుందా లేక ఇంకా సమయం పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ సినిమా కానీ మొదలు పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ నిరాశ పడడం ఖాయం.