క్రేజీ అప్డేట్ : ప్రభాస్ “సలార్” పై అదిరే హింట్ ఇచ్చిన సినిమా ఆర్ట్ డైరెక్టర్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ స్థాయి హైప్ పెట్టుకొని ఉన్న అతి కొద్ది చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార్” కూడా ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇది కాగా దీనిపై పాన్ ఇండియా లెవెల్లో తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాపై ఎప్పటికప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకి వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఆ మధ్య భారీ హైప్ నెలకొల్పిన టీజర్ అప్డేట్ కూడా ఒకటి. ఇది గాని వచ్చి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పాలి.

మరి ఇప్పుడు దీనిపై అయితే ఓ అదిరే హింట్ ని ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపాడు. మీడియా తో మాట్లాడుతు ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ నెలలో స్టార్ట్ అవ్వబోతుంది అని హైదరాబాద్ లో ఆల్రెడీ భారీ సెట్టింగ్స్ వేశామని తెలిపారు.

అంతే కాకుండా టీజర్ అప్డేట్ కూడా ఆన్ ది వే అంటూ ఇంకో క్రేజీ అప్డేట్ ని అందించారు. దీనితో ఇప్పుడు ఈ మాసివ్ హింట్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి రేస్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.