షాకింగ్ : మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నాడా??

RaviTeja Doing Megastar Film Or Not

RaviTeja Doing Megastar Film Or Not : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర చాలా మేర మల్టీ స్టారర్ సినిమాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాల్లో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలే ఆల్ మోస్ట్ ఉన్నాయి. అయితే మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఒక్క భోళా శంకర్ తప్ప మిగతా అన్ని సినిమాలు మల్టీ స్టారర్లే..

అయితే ఈ లిస్ట్ లో దర్శకుడు బాబీతో ప్లాన్ చేసిన భారీ సినిమా “వాల్తేర్ వీరయ్య” కూడా ఒకటి. మళ్ళీ పాత చిరంజీవినే గుర్తు చేసే విధంగా తెరకెక్కిస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపారు. మరి ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించేందుకు గాను మాస్ మహారాజ రవితేజ ని సంప్రదించి ఓకే చేసినట్టుగా కూడా చిత్ర వర్గాలు కన్ఫర్మ్ చేసారు.

కానీ రీసెంట్ గా మెగా ఫ్లాప్ “ఆచార్య” దెబ్బ కి రవితేజ మనసు మార్చుకున్నాడని సినిమా నుంచి తప్పుకున్నాడని పలు రూమర్స్ వినిపించాయి. అయితే ఇపుడు సినీ వర్గాల నుంచి దీనిపై తుది క్లారిటీ వినిపిస్తుంది.

ఈ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నాడని దానికి కారణం ఆచార్య ప్లాప్ రెమ్యునరేషన్ లు లాంటివి ఏవి కాదని సినిమాలో రవితేజ ఉన్నాడని తెలుస్తుంది. పైగా రవితేజ షూటింగ్ కోసం కూడా రవితేజ రెడీగానే ఉన్నాడని వినికిడి. సో ఆ రూమర్స్ లేదా గాసిప్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని ఇప్పుడు అర్ధం అవుతుంది.