Bheemla Nayak : టాలీవుడ్ నుంచి ప్రెజెంట్ రాబోతున్న పలు సాలీడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్యా, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్”. టాలీవుడ్ లో “అఖండ”, “పుష్ప” లాంటి భారీ మాస్ సినిమాలు తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే అని ఇప్పటికి మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇంకా వచ్చే ఫిబ్రవరి 25న రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత రిలీజ్ వాయిదా పడుతుందా లేక కరోనా తగ్గి రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుంది. అయితే వీటికి అతీతంగా ఓ టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. పవన్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతుందట.
ఈ సినిమా రిలీజ్ టైం కి పరిస్థితి అదుపులోనే ఉంటుంది అని అందుకే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ నిర్మాతలు ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అందుకే అక్కడ డిస్ట్రిబ్యూటర్ లు ఆల్రెడీ ఫిబ్రవరి 25 రిలీజ్ కి అన్ని పనులు ఈరోజు నుంచి స్టార్ట్ చేశారట.
అంతే కాకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అక్కడ తెలుస్తుంది. సో భీమ్లా నాయక్ వాయిదా పై ఎలాంటి కాంప్రమైజ్ లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాని సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తుండగా మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.