Jr Ntr: అది ఫేక్ అకౌంట్ అంటూ అభిమానులు హెచ్చరించిన ఎన్టీఆర్..?

Jr Ntr: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా లక్ష్మీప్రణతి ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీ ప్రణతి కి మంచి స్వాగతం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్దఎత్తున వినిపించాయి. ఇకపోతే లక్ష్మీ ప్రణతి నిజంగానే ట్విట్టర్ లో జాయిన్ అయ్యిందా అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికారికంగా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఒకవేళ లక్ష్మీప్రణతి కనుక ట్విట్టర్ లో జాయిన్ అయి ఉంటే తన భర్త జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేసేవాడు.

అదేవిధంగా ఆమె ట్విట్టర్ హ్యాండిల్ ను అభిమానులకు షేర్ చేసే వాడు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్టీఆర్ నుండి ఎలాంటి స్పందన కూడా రాలేదు. ఇకపోతే లక్ష్మీప్రణతి పేరుతో ఉన్న అకౌంట్ నుండి తాజాగా నా భర్త యొక్క ఫోటోను మొదటిసారిగా ట్వీట్ గా షేర్ చేస్తున్నాను అంటూ ఒక ఫోటోని షేర్ చేసినా కూడా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనితో నెటిజెన్స్ ఆ అకౌంట్ ఫేక్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ట్విట్టర్ లో లేదా ఇతర సోషల్ మీడియా ఖాతా లో జాయిన్ అయిన సమయంలో ఖచ్చితంగా రేర్ ఫోటోలు షేర్ చేయడం జరుగుతుంది.

కానీ లక్ష్మీ ప్రణతి అకౌంట్ పేరుతో ఉన్న అకౌంట్ లో గూగుల్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానులకు సదరు మీడియా సర్కిల్స్ వారు ఫేక్ అకౌంట్ తో జాగ్రత్తగా ఉండండి అంటూ ఇస్తున్నారు. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం ఈ మధ్య సాధారణం అయింది. సెలబ్రిటీల పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తూ వారి సెలబ్రిటీలు అన్న విధంగా అభిమానులు నమ్మిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఇలాంటి విషయాలలో పలువురు సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఫేక్ అకౌంట్ ను నమ్మొద్దు అంటూ సెలబ్రిటీలు వారి అభిమానులకు సూచించారు.