సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును సృష్టించిన లైజర్ న్యూడ్ ఫోటో?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ మేరకు సినిమా నుండి విజయ్ దేవరకొండ నగ్న ఫోటో ని రిలీజ్ చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన విజయ్ పోస్టర్ నగ్నంగా ఉండటంతో ప్రస్తుతం ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ పోస్టర్ రిలీజ్ చేయటంతో ఇలాంటి పోస్టర్ ఏంటంటూ కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పోస్టర్ ఎలా ఉందో అన్న అంశంపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడ చేస్తున్నారు. అయితే ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేయటం వెనుక కూడా పెద్ద స్టోరీ ఉంది. సాధారణంగా కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనబోయే వారి బరువు కొలవడానికి వారి ఒంటిమీద నూలపోగు కూడా ఉండనివ్వరు. ఎందుకంటే వారి బరువును గ్రామ్‌లలో కొలుస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు.

బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించనున్నాడు. అందుకు సింబాలిక్ గా ఈ న్యూడ్ పోస్టర్ విడుదల చేశారు .అయితే ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో ఈ పోస్టర్ అతి తక్కువ కాలంలోనే 1 మిలియన్ మార్క్‌కు చేరుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ప్రేక్షకులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేయటం మరొక విశేషం. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 25వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల కానుంది.