Nayanathara: మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ లో పాల్గొన్న లేడీ సూపర్ స్టార్ నయనతార!

Nayanathara: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన లేకుండా ఉన్న సన్నివేశాలను చిత్రీకరించాలని చిత్రబృందం భావిస్తోంది ఈ క్రమంలోనే ఈ చిత్రంలో పలువురు నటీనటుల పై చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నయనతార మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈమె హైదరాబాదులో షూటింగ్ లో పాల్గొని షూటింగ్ లోకేషన్ నుంచి తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా నయనతార కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార సైరా నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించగా ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో ఆయన సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దాదాపు 70 శాతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది.