తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 15.71 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారుతుంది. తాగు నీటి కష్టాలు ఏపీకి మొదలైపోతాయి. ఇప్పటివరకూ సస్యశ్యామలంగా ఉన్న పోలాలు అన్ని బీడుగా ఏడారి భూములైపోతాయి. దీనిపై ఏపీ రాష్ర్ట సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్ట్ ల నిర్మాణం వెంటనే నిలిపివేసి, ఏపీ రైతాంగానికి న్యాయం చేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి రాజేంద్రసింగ్ షశ్రీకావత్ కు అన్ని వివరాలతో కూడిన వినతి ప్రత్రాన్ని ఏపీ సమాఖ్యం అందజేసింది.
బచావత్ , బ్రేజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పులను ఉదహరించింది. కృష్ణా పరివాహాక ప్రాంతంలో రాను రాను వర్షాభావ పరిస్థితులతో దుర్భిక్ష వాతావరణం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ కు సాగునీరు రావడం కష్టంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలానికి ఎగువన పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల పథకం నిర్మిస్తుండటంతో రాష్ర్ట రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సమాఖ్య అధ్యక్షులు వెంకటగోపాల కృష్ణారావు స్పష్టం చేసారు.
కేంద్ర జలనవరుల శాఖ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూ సీ, కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాస్ 6 టీఎసీలు, తమ్మిళ్ల తదితర కొత్త పథకాలను 150 టీఎంసీలతో పాటు, ఎస్ ఎల్ బీసీ కల్వకుర్తి, నెట్టెంపాడు మొదలుగు పథకాల విస్తరణకు 105 టీఎంసీల సామర్ధ్యంతో మొత్తం మీద 250 టీఎంసీల కెపాసిటీగల వివిధ ప్రాజెక్ట్ లను నిర్మిస్తోందని ఆయన వివరించారు. ఇవన్నీ పూర్తయితే ఏపీ లోని చాలా వ్యవసాయ బూములు బీడు భూములుగా మారిపోతాయని హెచ్చరించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లాలని సూచించారు. మొత్తగా ఉంటే కేసీఆర్ ఏపీకి తాగు నీరు కూడా లేకుండా చేస్తారని అన్నారు.