Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఇది ఇలా ఉంటే విడుదల అయ్యే చాలా సినిమాలకు రన్ టైమ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. స్టార్ హీరోలు డైరెక్టర్లు రన్ టైం మూడు గంటలు అయినా సరే వెనకాడటం లేదు. ఇటీవల విడుదలైన యానిమల్, పుష్ప 2 రన్ టైమ్ కూడా మూడు గంటలపైనే ఉండటం, అవి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించడంతో ఇప్పుడు అంతా తమ సినిమాల రన్ టైమ్ మూడు గంటలపైనే ఉండేలా చూసుకుంటున్నారు. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా ఇదే కోవుకు చెందనుంది అంటూ వార్తలు వినిపించాయి. శేఖర్ కమ్ముల రెగ్యులర్‌గా తన సినిమాల కోసం ఎక్కువ ఫుటేజ్‌ని వాడుతాడని, దాన్ని ఎడిటర్ టేబుల్ వద్దకు వచ్చేసరికి కావాల్సిన వరకు ట్రిమ్ చేస్తారనే టాక్ ఉంది.
అయితే ఇటీవల రన్ టైమ్ విషయంలో ఎవరూ రాజీపడటం లేదు కాబట్టి కుబేర రన్ టైమ్ కూడా మూడు గంటలకు పైనే ఉంటుందని అందరు భావించారు. కానీ అందుకు భిన్నంగా శేఖర్ కమ్ముల ప్లాన్ చేసుకుని ఈ మూవీ రన్ టైమ్ ని మూడు గంటలలోపే కుదించడం విశేషం. ఒక దశలో ఈ సినిమా రన్ టైమ్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ మూవీ మేకర్స్ కుబేర రన్ టైమింగ్ 2 గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేశారట. దీంతో ఈ సినిమా రన్ టైమ్ విషయంలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టినట్టు అయింది.