Kubera: కుబేర ట్రైలర్ రిలీజ్.. ఆదరగొట్టిన రష్మిక, ధనుష్.. వీడియో వైరల్!

Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, అప్డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో అనగా జూన్ 20వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ మేకర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా కుబేర సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. మొట్టమొదటిసారి హీరో ధనుష్ కుబేర సినిమాలో ఒక పాట పాడిన విషయం తెలిసిందే. కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతంలో పాడారు. ఇకపోతే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో ధనుష్, రష్మిక తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జున మాత్రం కుమ్మేశారని చెప్పాలి. అలాగే ధనుష్ బిచ్చగాడిలా తన నటనతో ఆకట్టుకున్నాడు.

Kuberaa Official Trailer – Telugu | Nagarjuna | Dhanush | Rashmika Mandanna | Sekhar Kammula | DSP

ఒక బిచ్చగాడు ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేపథ్యం అతని కోసం విలన్స్ వెతకడం చాలా ఆసక్తిగా అనిపించింది. అలాగే ఒక ధనికుడు ప్రపంచాన్ని, ఒక పేదవాడి ప్రపంచాన్ని ఎలా కలిపారు అనేది చూడాలంటే కుబేర సినిమాకు వెళ్లాల్సిందే. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. మరి మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి. అలాగే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో ధనుష్ కి తెలుగు సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి మరి.