తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించాడు. అంతేకాకుండా పెట్రోల్ ధరల గురించి కూడా చర్చించాడు. రష్యా- ముఖ యుద్ధ ప్రభావం ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని అన్నాడు. ఇక పెట్రోల్ ధరలు తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
కేంద్రం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారని అన్నాడు. లీటర్ పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తుందని.. రాష్ట్రం వ్యాట్ తగ్గిస్తే లీటర్ పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చని అన్నాడు. ఇక దోచుకున్న సొమ్ము దాచుకునేందుకు కేటీఆర్ విదేశ పర్యటనకు వెళ్లాడు అని.. సీఎం కేసీఆర్ ఇక్కడ చేసిందేమీ లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట అని వెటకారం చేశాడు. ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సహాయం చేస్తారట అని అన్నాడు.