Krithi Shetty: అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి , ఆ సినిమాలో తన అందంతో నటనతో అభిమానులను సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమా ద్వారా కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోయింది అనటంలో సందేహం లేదు.
తాజాగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తను నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అవటంతో కృతి శెట్టి తన రెమ్యూనరేషన్ కూడా భారీగా ఓపెన్ చేసింది అని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం కృతి శెట్టి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన బంగార్రాజు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున , రమ్యకృష్ణ నాగచైతన్య , కృతి శెట్టి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ సినిమా “:సోగ్గాడే చిన్నినాయన” సినిమాకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ బంగార్రాజు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది .
కృతి శెట్టి మాట్లాడుతూ ” బంగార్రాజు సినిమాలో నేను ‘నాగలక్ష్మి ‘ పాత్రలో కనిపించనున్నాను. ఈ పాత్ర గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపించింది .ఈ సినిమాలో బీటెక్ చదివి గ్రామ సర్పంచ్ గా చేశాను. నాగార్జున గారితో సినిమా చేయాలన్నప్పుడు..ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడ్డాను. కానీ ఆయన హుందాతనం, తోటి నటులను గౌరవించే విధానం చూసి ఆశ్చర్యపోయాను. నేను చదివిన సైకాలజీ నాకు ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాగార్జున గారు షాట్ లేనప్పుడు ఎంతో క్లాసీగా మాట్లాడుతారు. షార్ట్ రెడీ అవగానే వెంటనే ఆ పాత్రలో లీనమై పోతారు . రమ్యకృష్ణ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నా “అంటూ మన బేబమ్మ బంగార్రాజు సినిమా విశేషాలను చెప్పుకొచ్చింది. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా మన బెబామ్మ కు మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.