Krithi setty: నాని అంటే ఎంతో ఇష్టం అంటూ తన మనసులో మాటను బయటపెట్టిన ఉప్పెన బ్యూటీ!

Krithi setty: ఉప్పెన సినిమా ద్వారా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తన రెండవ సినిమాను నేచురల్ స్టార్ నాని సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో నటించగా సాయిపల్లవి, కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వరంగల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర విజువల్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక హీరో నాని గురించి మాట్లాడుతూ నాకు సినిమాలలోకి రాకముందు నుంచి హీరో నాని అంటే ఎంతో ఇష్టమని కేవలం నాకు మాత్రమే కాకుండా మా ఫ్యామిలీ కూడా ఆయనంటే ఎంతో అభిమానమని ఈ సందర్భంగా కృతి శెట్టి నాని గురించి మాట్లాడారు. ఇలా నాని అంటే ఎంతో అభిమానం ఉన్న తనకు తన రెండవ సినిమా తనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక డిసెంబర్ 24వ తేదీ రాబోతున్న ఈ సినిమాను తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాలని ఈ సినిమా అందరికీ నచ్చుతుందని కృతి శెట్టి వెల్లడించారు.