నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

ఒక్క సినిమాతో త‌న రాత‌నే మార్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు అమ్మాయి కాక‌పోయిన ప‌నిపై శ్ర‌ద్ధ‌తో కొద్ది రోజుల‌లో తెలుగు నేర్చుకొని డైలాగులకు అనుగుణంగా అద్భుత‌మైన హావ‌భావాలు ప‌లికించింది. అస‌లు వైష్ణ‌వ్ తేజ్ క‌న్నా కూడా కృతి శెట్టినే అద్భుతంగా న‌టించింద‌ని కొంద‌రు అంటున్నారు. కృతి న‌ట‌న‌కు ఫిదా అయిన చిరంజీవి ఆమెకు స్పెష‌ల్ గిఫ్ట్స్ కూడా పంపారు. మ‌హేష్ కూడా కృతి న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఉప్పెన సాధించిన అద్వితీయ విజయంతో కృతి రేంజ్ ఎక్క‌డికో వెళ్ళింది. ప్ర‌స్తుతం శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో పాటు ప‌లు సినిమాలు చేస్తున్న కృతి ద‌గ్గ‌ర‌కు ఇత‌ర ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయట‌. దీంతో దీపముండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌ని భావించిన ఈ అమ్మ‌డు వెంటనే తన మార్కెటింగ్ స్ట్రాటజనీ కూడా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఉప్పెన సినిమాకు కేవ‌లం 6 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న కృతి శెట్టి .. ‘శ్యామ్ సింఘ రాయ్’ చిత్రం,సుధీర్ బాబు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాల కోసం ఒక్కో సినిమాకు 25 ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుంటుంద‌ట‌.

ఇక నుండి ఏ సినిమా చేయాల‌న్నాకూడా 60 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాల్సిందే అని గీత గీసుకు కూర్చుంద‌ట‌. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌కు ముగ్దులైన నిర్మాత‌లు అంత మొత్తం ఇచ్చేందుకు కూడా సిద్ద‌మ‌వుతున్నార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు స‌క్సెస్ టూర్‌లో ఉంది. ప‌లు ఏరియాల‌కు వెళ్ళి అక్క‌డ త‌న అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టిస్తూ సంతోషంగా గ‌డుపుతుంది. స‌క్సెస్ టూర్ ముగిసాక త‌ను క‌మిట్ అయిన సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నుంది.