ఓటిటి రిలీజ్ కి సిద్ధమైన “కృష్ణ వ్రింద విహారి”

అందం తో పాటు చాలా టాలెంట్ ఉన్నా కానీ నాగ శౌర్య కి టైం కలిసి రావడం లేదు. తాను నటించిన సినిమాలు ఈ మధ్య ఒక్కటి కూడా హిట్ అవ్వడంలేదు. ‘వరుడు కావలెను’ పర్వాలేదు అనిపించుకున్నా…’లక్ష్య’ సినిమా చాలా నిరాశ పరిచింది.

ఈ మధ్య రిలీస్ ఐన  “కృష్ణ వ్రింద విహారి” సినిమా కూడా అలరించలేకపోయింది. ఈ సినిమాకి, నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాకి దగ్గర పోలికలు ఉండడంతో ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.

థియేటర్ లో ఆకట్టుకొని ఈ మూవీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా ఇందులో అయితే ఈ అక్టోబర్ 23 నుంచి చిత్రం స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.  అనీష్ కృష్ణ  దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ లో షిర్లే షెటియా లు హీరోయిన్ గా  నటించింది.