Kranthi Balivada: సెట్లో అల్లు అర్జున్‌లాగా రవితేజ అందరితోనూ కలిసిపోడు… ఆయనకు నచ్చిందే చేస్తాడు…. క్రాంతి బలివాడ!

Kranthi Balivada: తాను రేసు గుర్రం సినిమాలో నటించినందుకు తనకు మంచి గుర్తింపు వచ్చిందని సినీ ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ అన్నారు. ఇక హీరో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఆయన సెట్లో ఉన్నంతసేపు అందరితోనూ చాలా సరదాగా మాట్లాడుతారని ఆమె చెప్పారు. మనకు ఒకవేళ పెద్ద స్టార్ పరిచయం అయితే పెద్ద హీరో ఎందుకులే ఎక్కువ మాట్లాడడం, మన పని మనం చేసుకుందాం అని అనుకుంటాం, కానీ ఆయనే వచ్చి హాయి చెప్పి, ఎలా ఉన్నారు అని పలకరించేవారని ఆమె చెప్పారు.

అయితే ఆ సినిమాలో హోటల్‌ సెట్‌లో అల్లు అర్జున్, ఎమ్మెస్ గారు, తాను, హీరోయిన్, ఇంకొందరు ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవారమని ఆమె చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ అందరితో కలిసిపోయి, జోక్స్ వేస్తూ ఉండేవారని ఆమె తెలిపారు. సెట్‌కి వచ్చినపుడు మొదట్లో తాను మాట్లాడలేదని, ఆయనే వచ్చి, పక్కన కూర్చొని ఐ యామ్ అల్లు అర్జున్ అని ఆయనంత ఆయన్నే పరిచయం చేసుకుని మాట్లాడారని ఆమె చెప్పారు. హీరోయిన్ శృతిహాసన్ వచ్చినపుడు ఆమెను కూడా పిలిచి, తనను పరిచయం చేసి, కబుర్లు చెప్పేవారని ఆమె అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వెరీ లైవ్‌లీ అండ్ హ్యాపీ పర్సన్ అని ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.

ఇకపోతే తాను మాస్ మహారాజా రవితేజ గారితో కూడా కలిసి 2 సినిమాల్లో నటించానని క్రాంతి బలివాడ తెలిపారు. ఇక రవితేజ గారి గురించి చెప్పాలంటే అల్లు అర్జున్‌ అయితే అందరితో కలిసిపోయి మాట్లాడుతారని, రవితేజ మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉంటారని ఆమె చెప్పారు. అందరితోనూ మాట్లాడుతారు, కానీ ఆ సీన్ వరకు ఎంత మాట్లాడాలో అలా మాట్లాడుతారని, కానీ ఆయనంతట ఆయన్నే వచ్చి కలిసిపోయే వ్యక్తి కారని ఆమె చెప్పారు. రవితేజ తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తారని అందరూ అంటుంటారు.. కాబట్టి అందరూ కూడా ఆయన దగ్గర అలానే ఉంటారని ఆమె అన్నారు. ఎవరితోనూ మరీ అంత జోవియల్‌గా వెళ్లిపోరని ఆమె స్పష్టం చేశారు.