నాగబాబు, పవన్ లపై కోటా సంచలన కామెంట్స్.!

గత కొన్ని రోజులుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద మా ఎన్నికల చుట్టూతా పలు ఆసక్తికర పరిస్థితులే చోటు చేసుకున్నాయి. మరి ఈ క్రమంలోనే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేస్తున్న పలు కామెంట్స్ కూడా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలానే మెగా సోదరుడు నాగబాబు కూడా ఆయనపై చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి.

ఓ రకంగా ప్రకాష్ రాజ్ ఓటమికి కూడా నాగ బాబు కామెంట్స్ నే ప్రధాన కారణం అని ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పుడు కోటా నాగబాబు పవన్ లపై సంచలన కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి లేకపోతే ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ లు అసలు ఎవరు?

అలానే చిరు పవన్ లు లేకపోతే నాగబాబు ఒక్క సాధారణ నటుడు మాత్రమే, గతంలో ఇదే నాగబాబు ప్రకాష్ పై కామెంట్స్ చెయ్యలేదా? అప్పుడు నేనేమన్నా అన్నానా? మరి ఇప్పుడు నాపై ఎందుకు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నాడో అని కోటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు.