Koratala Siva : ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ కోసం అదిరే సబ్జెక్ట్ రెడీ చేసిన కొరటాల? లైన్ ఇదేనట!

Koratala Siva : టాలీవుడ్ పవర్ ఫుల్ మాస్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. తనదైన మాస్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో పాన్ ఇండియన్ లెవెల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు.

అయితే ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా అనంతరం ఎన్టీఆర్ చేసే ఒక్కో సినిమా కూడా వేరే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ట్రిపుల్ ఆర్(RRR) అయ్యిన వెంటనే తన మరో హిట్ దర్శకుడు కొరటాల శివ తో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇది ఎన్టీఆర్ 30 వ సినిమా కావడంతో దీనిపై మరిన్ని స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా లైన్ పై ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ భారీ చిత్రాన్ని కొరటాల ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. అదిరే ఏక్షన్ ఎలిమెంట్స్ తో మరియు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండనున్నట్టు తెలుస్తుంది. దీనితో ఈ టాక్ ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.