వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు దర్శకుడు కొరటాల శివ. తీసింది నాలుగు సినిమాలే అయినా బోలెడంత స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాలను ప్రస్తావించే కొరటాల శివ అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడ సోషల్ ఇష్యూస్ మీద స్పందిస్తూ ఉండేవారు. అస్సలు నెగెటివిటీ అనేదే లేని డైరెక్టర్ ఆయన. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు, అందరు హీరోల అభిమానులకు ఆయన అంటే అభమానం. అలాంటి కొరటాల శివ ఉన్నట్లుండి సోషల్ మీడియా నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీంతో వదిలేది వెళ్ళేంత కష్టం ఆయనకు ఏం వచ్చింది అనుకుంటున్నారు.
‘నేను సోషల్ మీడియా నుండి పూర్తిగా తప్పుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నాను. ఇప్పటివరకు మీతో అనేక విషయాలు పంచుకున్నాను. మీరో నాకు చాలా మూమెంట్స్ ఉన్నాయి. కానీ విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మన మీడియా స్నేహితుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్లోనే ఉంటాను. మనం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. మన మధ్య మీడియం మరిందే తప్ప బంధం కాదు’ అంటూ ప్రకటన విడుదల చేశారు. నెగెటివిటీ అంటే అస్సలు పడని కొరటాల శివ బహుశా సామాజిక మాధ్యమాల్లోని నెగెటివిటీని చూడలేకనే వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న ఆయన అది ముగియగానే ఎన్టీఆర్ హీరోగా కొత్త చిత్రం స్టార్ట్ చేస్తారు.