ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల ఎవర్ని దింపుతున్నారో తెలుసా…

Koratala Siva NTR movie
Koratala Siva NTR movie
 
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా అంటే పెద్ద సెటప్ ఉండాల్సిందే. ఆయన తీసుకునే ప్రతి కథా భారీగానే ఉంటుంది.  అందుకే సినిమా సెటప్ కూడ పెద్దదిగానే ఉంటుంది.  తన సినిమాలో ప్రతి పాత్ర కోసం పెద్ద నటుల్ని తీసుకోస్తుంటారు ఆయన. పర భాషల్లో పేరున్న స్టార్లనే ఎంచుకుంటారు. ఇప్పటికే సత్యరాజ్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులను తన సినిమాల్లో నటింపజేసిన ఆయన ఈసారి ఇంకొక పెద్ద స్టార్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న ఆయన దాని తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు.  
 
ఆ సినిమా కూడ సోషల్ యాంగిల్ ఉన్న స్టోరీనే.  అందులో కూడ కథానాయకుడి క్యారెక్టర్ కాకుండా ఇంకొక ముఖ్యమైన పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ఆయన మమ్ముట్టిని అప్రోచ్ అవుతున్నారట. మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటుడే.  స్టార్ ఇమేజ్ ఉంది ఆయనకు.  ఇటీవల చేసిన ‘యాత్ర’ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు.  నటుడిగా గొప్ప స్థాయి ఆయనది.  ఆయనలాంటి స్టార్ ఎన్టీఆట్ తో కలిసి నటిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరేలా ఉంటుంది. అందుకే కొరటాల మమ్ముట్టి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.