ఆ సినిమా దెబ్బకి ఆస్తులు అమ్ముకున్న కొరటాల శివ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి, శ్రీమంతుడు జనతా గ్యారేజ్ అంటే సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్ లో నుండి సినిమా తీసేసే పరిస్థితికి వచ్చింది.

అయితే ప్రస్తుతం కొరటాల శివ గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఆచార్య సినిమా వల్ల కొరటాల నష్టాల్లో కూరుకుపోయి వాటిని తీర్చటానికి ఆస్తులు అమ్మినట్టు తెలుస్తోంది. నిజానికి ఆచార్య సినిమా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు కలిసి నిర్మించారు. కానీ కరోనా కారణంగా సినిమా ఆలస్యం కావటంతో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. దీంతో కొరటాల శివ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా సినిమా తెరకెక్కించారు. అందువల్లే సినిమా డిస్ట్రిబ్యూషన్ పనులు కూడా కొరటాల దగ్గరుండి మరీ చూసుకున్నారు.

ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. బయ్యర్లకు15 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావటం వల్ల కొరటాల తన అస్తులలో కొంత భాగం అమ్మేశారట. ఆచార్య సినిమాతో ఇంతకాలం కొరటాల కష్టపడి సంపాదించుకున్న పేరుతో పాటు ఆర్ధికంగా కూడా నష్టపోయాడు. దీనితో ఆచార్య ఫెయిల్యూర్ బాధ్యత కొరటాల తీసుకున్నట్లు అయ్యింది. ఇక ఆచార్య సినిమా తర్వాత కొరటాల జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాకి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. అందువల్ల ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ వస్తోంది.