ఎన్టీఆర్ 30 కోసం వారిపై అధిక ఒత్తిడి తెస్తున్న కొరటాల…!

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అపజయం ఎరుగని కొరటాల శివకు ఆచార్య సినిమా ద్వారా తన కెరియర్లో సినిమా ఫ్లాప్ సినిమా వచ్చి పడింది. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేయనున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆచార్య సినిమా మాదిరి నిరాశ పరచ కూడదని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావాలని కొరటాల ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం కొరటాల పలువురిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొరటాలశివ సినిమాలకూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తారు.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆచార్య సినిమా కోసం మెగాస్టార్ సూచనమేరకు మణిశర్మ సంగీత దర్శకునిగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30లో ఈయన అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప త్రిబుల్ ఆర్ వంటి సినిమాల తరహాలో ప్రేక్షకులను తన సంగీతంతో ఆకట్టుకునేలా ఉండాలని ఈయనపై కొరటాల అధిక ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అనిరుద్ తోపాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పై కూడా కొరటాల శివ అధిక ఒత్తిడి చేస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ఎలా అయితే చూపించారో ఎన్టీఆర్ సినిమాలో కూడా తన కొరియోగ్రఫీ అలాగే ఉండాలని, ఆర్ఆర్ పుష్ప తరహాలో ఈ సినిమాలో డాన్సులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శేఖర్ మాస్టర్ కు సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అరబిక్ కుతు హుక్ స్టెప్స్, యువతను ఉర్రూతలూగించే మాస్సివ్ స్టెప్స్ ను డిజైన్ చెయ్యమని కొరటాల శివ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ పై అధిక ఒత్తిడి తీసుకువస్తున్నారనీ సమాచారం.