శ్రీను వైట్ల నిజస్వరూపం బయటపెట్టిన కోన వెంకట్

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో శ్రీను వైట్ల కూడా ఒకరు. రవి తేజ తో ‘నీ కోసం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీను వైట్ల ‘ఆనందం’ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఢీ’, ‘వెంకీ’, ‘కింగ్’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాథ్షా’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన వరుస డిజాస్టర్స్ తో శ్రీను వైట్ల ఫేడ్ అవుట్ అయిపోయాడు.

అప్పట్లో శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ ల డి క్రేజీ కాంబినేషన్. అయితే ఎన్టీఆర్ మూవీ తర్వాత వీళ్ళు విడిపోయారు. అప్పటినుండి శ్రీను వైట్ల కి హిట్ పడలేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో స్టార్ రైటర్ కోన వెంకట్ శ్రీను వైట్ల గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు.

శ్రీనువైట్ల అంతా నేనే అంతా నేనే ని అనుకుంటారని కోన వెంకట్ కామెంట్లు చేశారు.నేను వర్క్ చేసినా పేరు వేయలేదని ఆ రీజన్ వల్లే విడిపోవాల్సి వచ్చిందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఇంక ఎప్పటికి శ్రీను వైట్ల కలిసి పని చెయ్యనని కోన వెంకట్ అన్నారు. అయితే వీళ్లిద్దరు మళ్ళీ కలిసి పనిచేస్తే సూపర్ హిట్స్ ఖాయం అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల తన కం బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు.