ఎన్టీఆర్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో?

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలవ్వాల్సింది కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల వల్ల షూటింగ్ స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చినా కానీ వీళ్ళ రెండో కాంబినేషన్ మీద అంత క్రేజ్ లేదు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎప్పుడైతే మూవీ అనౌన్స్ చేసారో…అప్పటినుండి ఈ సినిమా మీద భారీ అంచనాలు వచ్చేసాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెడతాడు.

లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పాడుకొనే ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లో ఒక పవర్ఫుల్ రోల్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో నటించడానికి విక్రమ్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా రిలీజ్ అయిన ‘పొన్ని సెల్వన్’ సినిమాలో విక్రమ్ రోల్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదని ఇప్పటికే విక్రమ్ ఫాన్స్ కోపంగా ఉన్నారు. అలాంటి ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో.