ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ భారీ అంచనాల మధ్య దసరా కానుకగా 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన దీని ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.
‘దేవర’ సెన్సార్ పూర్తి… 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల రన్‌టైమ్!
తాజాగా ఈ ట్రైలర్‌పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ‘దేవర’ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో కొన్ని సన్నివేశాలు రూపొందించారేమో అని అనిపించింది. రాముడు సముద్రాన్ని దాటినట్లు ‘దేవర’లోనూ ఎన్టీఆర్ పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్లు చూపించారు. సముద్ర తీరపాత్రం నేపథ్యంలో ఇది రానుంది.
ఇందులో మా చిన్నరామయ్య (ఎన్టీఆర్) పాత్రలో గమ్మత్తులు ఉన్నట్లు అర్థమవుతోంది. దేవర, భైరవగా కనిపించ నున్నాడు. దేవర అంటే హీరో అని అర్థమవుతోంది. మరి భైరవ విలన్ వైపు ఉంటాడేమో అనిపించింది. అలానే హీరోయిన్‌తో సరదాగా, అమాయకత్వంగా మాట్లాడడం చూస్తే.. కొరటాల శివ తన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయం అనిపిస్తుంది. ‘రక్తంతో సముద్రం ఎరుపెక్కే కథ..’ అని అన్నారు.
అంటే సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని ఓ డైలాగుతో చెప్పారు. ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు’ అని డైలాగ్ ఉంది. ఈ డైలాగుతో ఎన్నో ఆలోచనలు కలిగించారు. ‘దేవరని చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధమూ దొరకాలి’ అన్నారు. రామాయణంలోనూ రాముడు ఎన్నో బాణాలు ఉపయోగించాడు. అలానే ఇందులోనూ ఎన్నో ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రతీ అంశం రామాయణాన్ని పోలి ఉంటుందనిపిస్తుంది’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు ‘దేవర’ సూపర్ హిట్ అవ్వాలని ఆయన కోరుకున్నారు.