Keerthy Suresh: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రామ్ పోతినేని, మహేష్ బాబు, నాని వంటి హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకసారిగా ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమనిపించడంతో ఆ వార్తలు నిజమే అని ఆమె తండ్రి అధికారికంగా ప్రకటించారు.
దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి షాక్ రా బాబు అంటూ అభిమానులు నోరెళ్లపెట్టారు. పెళ్లి విషయంలో మాత్రం అభిమానులకు కీర్తి సురేష్ గట్టిగానే షాక్ ఇచ్చిందని చెప్పాలి.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోని తట్టిల్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. తాజాగా వీరి వివాహ వేడుక గోవాలో ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ప్రముఖులు కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అభిమానుల నుంచి ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరీ మధ్య ఏజ్ గ్యాప్ గురించి కొందరు చర్చించుకుంటున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుత వయసు 32 సంవత్సరాలు కాగా ఆమె భర్త వరుడు ఆంటోనీ వయసు 35 సంవత్సరాలు.
కీర్తి సురేష్ భర్తకు ఇండియాతో పాటు విదేశాల్లో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయట. కీర్తి సురేష్, ఆంటోని తట్టిల్ ఏజ్ గ్యాప్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. ఇప్పుడు గోవాలో పెళ్లిపీటలెక్కారు.