సర్కారు వారి పాట కోసం స్టైల్ మార్చిన కీర్తి సురేష్.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.. అందం, అభినయం తో పాటు ఎంతో చక్కని పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కథ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైతం అవలీలగా నటిస్తూ అభిమానుల్ని మెప్పిస్తుంది. మహానటి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి చాలా తక్కువ టైమ్ లోనే పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్టైల్ ని మార్చుకుంది. ఈ విషయంలో ఎంతో కమిట్ మెంట్ అవసరం. అందుకోసం ఎంతో కష్టపడాలి. ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడ స్ట్రాంగ్ గా ఉండాలి. సినిమాలో పాత్రకు తగ్గట్టు శరీరాకృతి కూడ ఉండాలి. అయితే కీర్తి సురేష్ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా కోసం మల్లె తీగ లా సన్నగా తయారయింది. దీంతో కీర్తి సురేష్ అభిమానులు షాక్ అయ్యారు. మరీ ఇంత సన్నగా మారడం ఏం బాలేదని.. కీర్తి సురేష్ కి జీరో సైజ్ సూట్ అవ్వలేదంటు కామెంట్స్ వినిపించాయి. లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా సెట్ అయింది. దీంతో దర్శకుడు పరశురామ్ బరువు పెరగాలని కోరడంతో కీర్తి.. బరువు పెరిగే పని లో పడింది. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

కీర్తి సురేష్ ప్రస్తుతం రంగ్ దే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్ లో ఓ సినిమా కోసం సైన్ చేసింది ఈ బ్యూటీ. అలాగే ఇండియన్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో కూడా కీర్తి నటిస్తుంది. ఎట్టకేలకు ఈ ఏడాదంతా కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీ గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.