Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారుకిరణ్ అబ్బవరం. మొదట రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇకపోతే కిరణ్ చివరగా క సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాని బేబీ నిర్మాత SKN నిర్మిస్తుండగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఇచ్చిన కథతో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ని తాజాగా ప్రకటించారు.
ఇందులో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ చెన్నై సముద్రం ఒడ్డున కూర్చొని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే చెన్నైలో జరిగే లవ్ స్టోరీ కథతో మరో కల్ట్ సినిమా తీసుకురాబోతున్నారు అని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాతో మరోసారి లవ్ స్టోరీ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్ ని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు. ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.