K-ramp: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. మొదట రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇకపోతే కిరణ్ చివరగా క సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కె-ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. యుక్తి తరేజా కథానాయిక నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా గ్లింప్స్ ను విడుదల చేశారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. గతంలో వీరి కాంబో ఎస్‌ఆర్ కళ్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది.

